Asaduddin Owaisi | హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో అసదుద్దీన్ వెనుకంజ.. ఆధిక్యంలో బీజేపీ
Asaduddin Owaisi | హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ అనూహ్యంగా వెనుకంజలో పడ్డారు. మజ్లిస్ కంచుకోట అయిన హైదరాబాద్‌లో ఇది అనూహ్య పరిణామం. ఇక్కడ 1984 నుంచి జరిగిన 10 లోక్‌సభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీనే విజయం సాధిస్తూ వస్తున్నది. 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగుసార్లు అసదుద్దీన్ ఒవైసీ ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు.
Asaduddin Owaisi : హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ అనూహ్యంగా వెనుకంజలో పడ్డారు. మజ్లిస్ కంచుకోట అయిన హైదరాబాద్‌లో ఇది అనూహ్య పరిణామం. ఇక్కడ 1984 నుంచి జరిగిన 10 లోక్‌సభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీనే విజయం సాధిస్తూ వస్తున్నది. 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగుసార్లు అసదుద్దీన్ ఒవైసీ ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు.
అంతకుముందు ఆరు పర్యాయాలు అసదుద్దీన్ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీగా గెలిచారు. ఈ లోక్‌సభ ఎన్నికల మూడో రౌండ్ ఫలితాలు వెలువడే సరికి అసదుద్దీన్‌పై బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్ల తర్వాత ఆమె 3,276 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే ట్రెండ్ చివరిదాకా కొనసాగితే పెద్ద సంచలనమనే చెప్పవచ్చు.
కాగా, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. రాష్ట్రంలో మొత్తం 34 ప్రాంతాల్లో 44 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. 139 కౌంటింగ్ హాల్స్‌లో ఈవీఎంల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ కోసం 14 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల మొదటి ఫలితం ఉదయం 11-12 గంటల మధ్య రానుంది. చొప్పదండి, యాకుత్‌పురా, దేవరకొండలో అత్యధికంగా 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు, ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram