జూబ్లిహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా ఫరాజుద్ధిన్‌

జూబ్లిహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా ఫరాజుద్ధిన్‌
  • ప్రకటించిన అసదుద్ధీన్‌ ఒవైసీ


విధాత : తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నికలలో ఎంఐఎం పార్టీ జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గానికి అభ్యర్థిగా మ‌హ‌మ్మ‌ద్ ర‌షీద్ ఫ‌రాజుద్దీన్ పేరును ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ ప్ర‌క‌టించారు. ఈ స్థానం నుంచి బీఆరెస్‌ అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున టీమిండియా మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్ పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సివుంది. బీఆరెస్‌కు పోటీగా ఇక్కడ ఎంఐఎం అభ్యర్థిని పోటీలో నిలపడంతో ఈ దఫా ఇక్కడ ఆసక్తికర పోటీకి తెరలేచింది.