Minister Jupally | బాధిత మహిళకు మంత్రి జూపల్లి పరామర్శ.. 2లక్షల ఆర్థిక సహాయం
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో దాడికి గురైన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు

విధాత : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో దాడికి గురైన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆమెకు అండగా ఉంటుందని చెప్పారు. తక్షణ సహాయంగా రూ.2 లక్షలు, ప్రభుత్వం తరఫున కొంత భూమి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈశ్వరమ్మ పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పిస్తామని తెలిపారు.
కాగా.. ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించిన వారికి చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈశ్వరమ్మ, ఈదన్న దంపతుల భూమిని కౌలుకు తీసుకున్న నిందితుడు వెంకటేశ్ ఆమెను అక్రమంగా నిర్భంధించి అమానుష రీతిలో లైంగిక దాడికి పాల్పడి చిత్ర హింసలకు గురిచేశాడు. ఈశ్వరమ్మ మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి, కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈశ్వరమ్మను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.