విధాత, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి, వేగవంతమైన రవాణా సదుపాయాల కోసం ఈ హై స్పీడ్ రైల్వే కారిడార్లు కీలకంగా నిలుస్తాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రైల్వే కారిడార్లప్రాజెక్టుల అమలులో వేగం పెంచి, సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హై స్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో హైదరాబాద్ – పూణే – ముంబై కారిడార్, భారత్ ఫ్యూచర్ సిటీ – చెన్నై కారిడార్, భారత్ ఫ్యూచర్ సిటీ – బెంగళూరు కారిడార్ ల నిర్మాణ ప్రాజెక్టులపై చర్చించారు. ఇప్పటికే డీపీఆర్ పూర్తయిన హైదరాబాద్ – పూణే – ముంబై హై స్పీడ్ రైల్వే కారిడార్‌పై మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ ప్రాజెక్ట్ పురోగతిని అధికారులు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్ట్ యొక్క సాంకేతిక అంశాలు, మార్గరేఖలు, భవిష్యత్ ప్రయోజనాలపై సమగ్ర వివరణ ఇచ్చారు. ఆయా ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని, నిర్థిష్ట గడువులోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి వెంకట్ రెడ్డి ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి ప్రావిణ్య, ఈఎన్సీలు మోహన్ నాయక్, జయ భారతి, సీఈ (ఆర్‌ఎస్‌డబ్ల్యూ) వనజతో పాటు పలువురు సీఈలు, రైల్వే అధికారులు, NHSRCL, HMDA, MAUD, HMRL అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
తెలంగాణలో ఓట్లు తొలగింపుకు బీజేపీ కుట్ర: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరామ్ ప్రమాణస్వీకారం
