సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి విచిత్ర ఘటన ఎదురైంది. ప్రజాదర్భార్ కు వచ్చిన ఓ బాలుడు మా ఊరికి ఆర్టీసీ బస్సు కావాలంటూ మంత్రి పొంగులేటికి ఆర్జీ సమర్పించాడు. ప్రజాదర్భార్ కు వచ్చి నిర్భయంగా..ముద్దుముద్దు మాటలతో మా ఊరు ఎర్రబోయినపల్లికి బస్సు నడిపించాలంటూ కోరిన బాలుడిని చూసి ముచ్చటపడిన మంత్రి..ఆ బాలుడిని ఏ బస్సు కావాలంటూ ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సమావేశంలో ఉన్న ఆర్టీసీ అధికారులను పిలిచి వెంటనే ఎర్రబోయినపల్లికి బస్సు నడపాలని ఆదేశించారు.
సర్వే చేసి బస్సు నడపడంపై నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు మంత్రికి సమాధానం చెప్పగా…సర్వే అక్కరలేదని ఆ ఊరికి బస్సు నడపాల్సిందేనని, వారం రోజుల్లో బస్సు ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. బస్సు రాకపోతే వెంటనే తనకు చెప్పాలని ఆ బాలుడికి సూచించారు. ఒక చిన్నారి అభ్యర్థనకు ప్రాముఖ్యతనిచ్చి, వెంటనే స్పందించి బస్సు వసతి కల్పించేందుకు ఆదేశాలిచ్చిన మంత్రి పొంగులేటి తీరు చర్చనీయాంశమైంది.
A Kid walked into the Praja Darbar with just one request in a letter: “Please provide an RTC bus for our village.”
The Minister read it, immediately called the RTC officials, and directed them to resolve the issue.
It’s heartening to see a public representative treat a child’s… pic.twitter.com/VGZgLBH0qf
— Yash Tweets (@Yashinonx) August 2, 2026
