పెద్దకొడుకులా మీ సమస్కలు తీరుస్తా.. పాలేరు వాసులకు మంత్రి పొంగులేటి హామీ
పాలేరు నియోజకవర్గం ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యల పరిష్కారంలో మీ ఇంటి పెద్దకొడుకుగా పనిచేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు
విధాత, హైదరాబాద్ : పాలేరు నియోజకవర్గం ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యల పరిష్కారంలో మీ ఇంటి పెద్దకొడుకుగా పనిచేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణిలో పర్యటించారు. ఎన్నికోట్లు ఖర్చు ఖర్చయినా నియోజవర్గంలోని అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు. మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారం మీ సమస్యలన్నీ తీరుస్తానన్నారు.
ప్రజల చెంతకే.. మీ శీనన్న, తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణి గ్రామంలో పర్యటన భాగంగా,
నేరుగా ప్రజల వద్దకే సమస్యలు తెలుసుకొని తగిన పరిష్కారాలు ఇచ్చిన మన ప్రియతమ నేత శీనన్న #Telangana #TelanganaCongress #congress pic.twitter.com/NTY44kJ9Kf
— Ponguleti Srinivasa Reddy (@mpponguleti) May 31, 2024
ఏ ఇబ్బంది వచ్చినా అధైర్య పడవద్దని.. తనకు చెబితే మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని… మీరు పడిన కష్టానికి ప్రతి ఫలం ఇస్తానని పొంగులేటి స్పష్టం చేశారు. గత బీఆరెస్ ప్రభుత్వం పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిపోగానే పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇళ్లు, గ్రామాల్లో అంతర్గత రహదారులు, రేషన్ కార్డులు ఇస్తామని పొంగులేటి చెప్పారు.ఎన్ని కోట్లు ఖర్చయినా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయాభివృద్ధికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. వచ్చే వానాకాలం పాలేరు రిజర్వాయర్‌లో నీరు లేకపోయినా సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram