Kavitha new party| తెలంగాణ కొత్త రాజకీయ శక్తిగా ప్రజల్లోకి : కవిత ప్రకటన
తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా నేను ముందుకు వస్తున్నానని..విద్యార్ధులు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు, నిరుద్యోగులు, మైనార్టీలు ప్రజాస్వామ్యయుత పోరాటాలు చేయలేని వారు అంతా తనతో కలిసి రావాలని కవిత కోరారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో కొత్త రాజకీయ శక్తి(new political party)గా నేను ముందుకు వస్తున్నానని..విద్యార్ధులు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు, నిరుద్యోగులు, మైనార్టీలు ప్రజాస్వామ్యయుత పోరాటాలు చేయలేని వారు అంతా తనతో కలిసి రావాలని కవిత(Kavitha) కోరారు. శాసన మండలిలో భావోద్వేగంతో మాట్లాడిన కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదించాలని కోరిన కవిత..సభ బయట మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రూ.9లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ను స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ఖర్చు చేసిందని..ఇరిగేషన్ పై 1.89కోట్లు ఖర్చు పెట్టిందని..అయితే ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. అత్యంత అవమానకరంగా నన్ను బీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టారని వాపోయారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న తప్పులపై నేను నాయకత్వం దృష్టికి తీసుకెళ్లానని..చివరకు అక్రమార్జన చేసిన వారు..పార్టీ ద్రోహులే గెలిచారని వాపోయారు. తల్లిగారి ఇంటి వంటి ఇంటి పార్టీ నుంచి నన్ను గెంటేశారన్నారు. అన్ని బంధాలు తెంచుకుని ప్రజల కోసం పనిచేసేందుకు బయటకు వచ్చానన్నారు.
తెలంగాణ రాజకీయ అస్థిత్వం కోసం, హక్కుల కోసం ఓ కొత్త రాజకీయ వేదికతో ఆడబిడ్డగా ప్రజల ముందుకు వస్తున్నానని, ఇది కేవలం నా ఆత్మగౌరం పోరాటం అని, తెలంగాణ ఆడబిడ్డలు అవమానిస్తే సహించబోరన్నారు. తెలంగాణ పేరును తనలో నింపుకున్న స్వతంత్ర రాజకీయ శక్తిగా జాగృతి పనిచేస్తుందని, రాష్ట్రంలో మహిళ నాయకత్వం దాదాపు నామమాత్రంగా ఉందని, మహిళలు రాజకీయ శక్తిగా ఎదిగేందుకు నాతో కలిసిరావాలన్నారు. కొత్త రాజకీయ శక్తి బలపడకుండా నాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి ఆరోపణలు చేస్తున్నాయన్నారు. నాది ఆస్తుల పంచాయతీ కాదు..ఆత్మగౌరవ పంచాయతీ అని కవిత స్పష్టం చేశారు. ఇప్పుడు నాపై ఎలాంటి ఆంక్షలు లేవని, ప్రజల గొంతుకగా పనిచేస్తాననన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెచ్చే కొత్త రాజకీయ వేదికతో ప్రజల మధ్యకు వస్తున్నానని, అన్ని వర్గాల ప్రజలు నన్ను దీవించండి..ఆశీర్వదీంచండి నాతో పాటు నడవండని కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram