పతాకస్థాయికి చేరిన పాలకుర్తి పంచాయతీ…పార్టీని భ్రష్టుపట్టించారని మీనాక్షికి ఫిర్యాదు
పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూప్ వార్ ప్రస్తుత పతాకస్థాయికి చేరింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త కాంగ్రెస్ పార్టీ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా రోజురోజుకు అసమ్మతివర్గం కొండాలా పెరిగి పార్టీని పుట్టిముంచే పరిస్థితికి చేరింది
- పతాకస్థాయికి చేరిన పాలకుర్తి పంచాయతీ
- కాంగ్రెస్ లో ముదిరిపాకానపడిన గ్రూప్ వార్
- అత్తాకోడళ్ళు ఝాన్సీరెడ్డి, యశస్వినిపై ఫైర్
- పార్టీని భ్రష్టుపట్టించారని మీనాక్షికి ఫిర్యాదు
విధాత, ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూప్ వార్ ప్రస్తుత పతాకస్థాయికి చేరింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త కాంగ్రెస్ పార్టీ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా రోజురోజుకు అసమ్మతివర్గం కొండాలా పెరిగి పార్టీని పుట్టిముంచే పరిస్థితికి చేరింది. ఇద్దరు అత్తా కోడళ్ళ ఏకపక్ష, ఆధిపత్య, ఒంటెద్దుపోకడల వల్లే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ ముదిరిపాకానపడినట్లు భావిస్తున్నారు. తొలి నుంచి పార్టీ కోసం శ్రమించి, పార్టీకి కోసం పనిచేసిని పాత కాంగ్రెస్ నాయకులను తొక్కిపట్టి తామే అంతా అనే విధంగా తాము చెప్పిందే నడవాలనే తీరుతో ఈ ఇద్దరు వ్యవహరించడంతో తీవ్ర అసంతృప్తికి లోనైనవారంతా జట్టుకట్టి కలిసికట్టుగా సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో సైతం వీరంతా కాంగ్రెస్ పార్టీలోనే అసమ్మతి వర్గంగా రెబల్ అభ్యర్ధులను బరిలోకి దింపారు. నియోజకవర్గంలో దాదాపు 30 గ్రామాల్లో రెబల్ అభ్యర్ధులను బరిలోకి దింపారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చని చెబుతున్నారు. పార్టీలోనెలకొన్న విభేదాలు, గ్రూప్ వార్ కారణంగా పార్టీలో వర్గాలుగా ఏర్పడి బరిలో నిలువడంతో ఎదుటిపక్షం బీఆర్ఎస్, ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు చాకచక్యంగాపావులు కదిపి సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించారు. సర్పంచ్ అభ్యర్ధులు సునాయసంగా గెలుపొందారు.
పార్టీ ఇంచార్జ్ మీనాక్షికి ఫిర్యాదు
పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపై పార్టీ అధిష్టానానికి నియోజకవర్గ అసమ్మతివర్గ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. ఝాన్సీ రెడ్డి మోనో ఇజం, షాడో ఇజంతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని వివరించారు. క్రమశిక్షణలేని వ్యక్తులు, సిటిజెన్ షిప్ లేని వ్యక్తి ఝూన్సీ రెడ్డి పీసీసీ వైస్ ప్రసిడెంట్ తీసుకున్నదన్నారు. ఇది పార్టీ వ్యతిరేకమైందన్నారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానాన్ని మోసం చేశారు. ఇంత మంది సర్పంచ్ లు ఓడిపోవడానికి కారణమేమిటని మీనాక్షి తమను ప్రశ్నించారని దీనిపై ఇద్దరి ప్రవర్తన బాగా లేదు. అసెంబ్లీ ఎన్నికలు జరుగగానే ఇద్దరు అత్తా కోడళ్ళు అంతా సర్ధుకొని అమెరికా వెళ్ళిపోయారని వివరించారు. దీంతో నియోజకవర్గంలో ప్రజలకు పార్టీ, కార్యకర్తలకు ఎవరూ అందుబాటులోలేరని పేర్కొన్నారు. పార్టీ కోసం శ్రమించి వారి గెలుపునకు పనిచేసిన మమ్మల్ని పార్టీ వ్యతిరేకులుగా, దయాకర్ రావు కోవర్టులుగా ముద్రిస్తున్నారని కాకరాల హరిప్రసాద్ లాంటి కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. ఝాన్సీ రెడ్డిని పీసీసీ వైఎస్ ప్రసిడెంట్ పదవి నుండి తొలగించాలని మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్తేజాన్ని తెచ్చి, దయాకర్ రావు లాంటి సీనియర్ నేతను ఓడించిన తమను కొందరు తప్పుపడుతున్నారని ఝూన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్వని రెడ్డి వారి వర్గం నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రత్యర్ధికి సహకరిస్తూ పార్టీని, తమను వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. పథకం ప్రకారం వీరంతా పనిచేస్తున్నారని ఝూన్సీ రెడ్డి అధిష్టానినికి, సీఎం తదితరులుకు చెప్పడం వల్ల అదే నిజమని వారు భావిస్తున్నట్లు అసమ్మతి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో నిజానిజాలు తెలుసుకునేందుకు పీసీసీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో పాలకుర్తిలో కాంగ్రెస్ గెలిచినా కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ తమ ప్రతిష్టను, పరువును వారే, గ్రూపు తగాదాలు, నాయకుల మధ్య విభేదాలతో నేలనాకిస్తున్నారని నిజమైన కాంగ్రెస్ అభిమానాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram