Ponnam Prabhakar | మెరుగైన వైద్య సేవలందించాలి … ఆర్టీసీ ఆసుపత్రి వైద్యులతో మంత్రి పొన్నం

హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి వచ్చే కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Ponnam Prabhakar | మెరుగైన వైద్య సేవలందించాలి … ఆర్టీసీ ఆసుపత్రి వైద్యులతో మంత్రి పొన్నం

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి వచ్చే కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని శనివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని ఆయన సందర్శించి
చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన వైద్య సేవలు అందుతున్న తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆర్టీసీ ఆసుపత్రి ద్వారా కార్మికులు కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందులో భాగంగా అవసరమైన వైద్య పరీక్షల వసతులను కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.