Minister Seethakka | మీ హయాంలోనే ఒక నెల పెన్షన్‌ ఎగవేశారు.. మేం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం: మంత్రి సీతక్క

రాష్ట్ర శాసన సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పెన్షన్ పంపిణీపై మాజీ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క బదులిచ్చారు.

Minister Seethakka | మీ హయాంలోనే ఒక నెల పెన్షన్‌ ఎగవేశారు.. మేం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం: మంత్రి సీతక్క

విధాత, హైదరాబాద్ : రాష్ట్ర శాసన సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పెన్షన్ పంపిణీపై మాజీ మంత్రి టి.హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క బదులిచ్చారు. చేయూత పెన్షన్లపై హరీష్ రావు అవాస్తవాలు చెబుతు సభను తప్పు దోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తున్నామని, గత ప్రభుత్వం నెల చివరి తేదీన కూడా పింఛన్లు ఇచ్చేదని, గత ప్రభుత్వం జూలై 2020 పెన్షన్ ఇవ్వకుండా ఎగవేసిందన్నారు.

పైగా మేము ఎగ్గొట్టిన్నట్లు నిందలు వేయడం సరికాదన్నారు. మా ప్రభుత్వంలో ఎలాంటి జాప్యం లేకుండా లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. బీఆరెస్ హయంలో వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయసు హామీపై మూడున్నర ఏండ్ల జాప్యం చేసి ఎన్నికల ముందు తగ్గించిందని, అయిదు వెలకు పైగా అనర్హులకు పెన్షన్‌లు ఇచ్చారన్నారు. బీఆరెస్‌ హయాంలో లక్షల జీతం తీసుకున్న ఒక కార్పొరేషన్ చైర్మన్‌కి కూడా ఆసరా పెన్షన్ ఇచ్చారని, త్వరలో వివరాలు వెళ్లడిస్తామని తెలిపారు.