నీట మునిగిన ఎంజీబీఎస్
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉస్మాన్ సాగర్, గండిపేట జలాశయాలకు వరద ముంచెత్తడంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు

విధాత: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉస్మాన్ సాగర్, గండిపేట జలాశయాలకు వరద ముంచెత్తడంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు. దీంతో నిన్న రాత్రి మూసీ నది ప్రవాహం ఒక్కసారిగి పెరిగింది. వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ఎంజీబీఎస్ బస్‌స్టాండ్ నీట మునిగింది. బస్‌స్టాండ్‌నుంచి మూసీ ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు అందులోనే చిక్కుకున్నారు.
వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో బయటికి రాలేక లోపలే ఉండిపోయారు. బస్టాండ్ లోపల చిక్కుకున్న ప్రయాణికులను తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నించారు. ప్రయాణికులు ఒక్కొక్కరుగా చేతులు పట్టుకొని బయటకు వచ్చారు.