Phone tapping case | ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీపీ భుజంగరావు (Bhujanga Rao)కు నాంపల్లి కోర్టు (Nampally Court) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Phone tapping case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీపీ భుజంగరావు (Bhujanga Rao)కు నాంపల్లి కోర్టు (Nampally Court) మధ్యంతర బెయిల్ (Bail) మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో భుజంగరావుకు 15 రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచివెళ్లరాదని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ట్యాపింగ్ కేసు లో భుజంగరావు ఏ 2గా ఉన్నారు.
ఈ కేసులో భుజంగరావును మార్చి 23న అరెస్టు చేశారు. గత ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాలతో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ప్రత్యేక ట్యాపింగ్ సామాగ్రితో ప్రతిపక్ష నాయకుల, జడ్జీలు, మీడియా ప్రతినిధుల, రియల్టర్లు, జ్యువెలరీ వ్యాపారులు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా కేసు విచారణ కొనసాగుతుంది.