Hyderabad | విద్యార్థుల ధర్నాల హోరు.. స్కాలర్ షిప్‌ల కోసం ఏబీవీపీ రాస్తారోకో

తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతు విద్యార్థులు రోడెక్కడంతో సోమవారం విద్యార్థుల ఆందోళనలు హోరెత్తాయి. పెండింగ్ స్కాలర్ షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 2వేల మంది విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

Hyderabad | విద్యార్థుల ధర్నాల హోరు.. స్కాలర్ షిప్‌ల కోసం ఏబీవీపీ రాస్తారోకో

హాస్టల్ వసతికి నిజాం కళాశాల విద్యార్థినిల ధర్నా

విధాత, హైదరాబాద్ : తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతు విద్యార్థులు రోడెక్కడంతో సోమవారం విద్యార్థుల ఆందోళనలు హోరెత్తాయి. పెండింగ్ స్కాలర్ షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 2వేల మంది విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పెండింగ్ స్కాలర్షిప్‌లు వెంటనే విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనతో ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిలో భారీ ఎత్తున వాహనాల రాకపోకలు స్తంభించాయి. రంగంలోకి దిగిన పోలీసులు, విద్యార్థులను ధర్నా విరమించాలని కోరగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రహదారి మీద బైఠాయించిన విద్యార్థులను చెదరగొట్టి ట్రాఫిక్ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు హైదరాబాద్ నిజాం కళాశాల విద్యార్థినిలు హాస్టల్ వసతి కోసం బషీర్ బాగ్ కూడలిలో ధర్నా చేపట్టారు. నిజాం కాలేజీలో నిర్మించిన మహిళా హాస్టళ్లను యూజీ విద్యార్థినులకే కేటాయించాలని ఈ సందర్భంగా స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. మహిళా హాస్టల్‌లో సీట్లు పీజీ విద్యార్థినులకు కాకుండా.. యూజీ విద్యార్థినిలకు కేటాయించాలని కోరారు. విద్యార్థినుల ఆందోళనతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులు చేరుకుని విద్యార్థులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసుల వాహనాల్లో తరలించారు.