ఒక ప్రమాదం నుంచి బయటపడి.. మరో ప్రమాదంలో దుర్మరణం
అమెరికాలో తెలంగాణకు చెందిన ఎన్నారై ఒకరు వరుసగా జరిగిన ఒక రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి ఆవెంటనే మరో ప్రమాదంలో దుర్మరణం చెందడం విషాదం రేపింది

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఎన్నారై పృథ్వీరాజ్ మృతి
విధాత, హైదరాబాద్ : అమెరికాలో తెలంగాణకు చెందిన ఎన్నారై ఒకరు వరుసగా జరిగిన ఒక రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి ఆవెంటనే మరో ప్రమాదంలో దుర్మరణం చెందడం విషాదం రేపింది. జహీరాబాద్ కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్(30) ఎనిదేళ్లుగా అమెరికాలోని నార్త్ కరోలినాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు.
బుధవారం భార్య శ్రీప్రియతో కలిసి కారులో వెళ్తూ వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టాడు. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. భార్యను కారులోనే కూర్చోబెట్టి ప్రమాదం గురించి పోలీసులకు ఫోన్ చేస్తుండగా వేగంగా వచ్చిన మరో కారు పృథ్వీరాజ్ ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న స్వగ్రామంలోని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు.