కేవ్ పబ్‌లో డ్రగ్స్‌ కలకలం.. పట్టుబడిన 24మంది

మణికొండలోని కేవ్ పబ్‌లో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు, రాయదుర్గం ఎస్‌వోటీ పోలీసులు సోదాలు చేశారు. పబ్‌లో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమాచారంతో ఆకస్మిక దాడులు చేశారు

కేవ్ పబ్‌లో డ్రగ్స్‌ కలకలం.. పట్టుబడిన 24మంది

విధాత, హైదరాబాద్ : మణికొండలోని కేవ్ పబ్‌లో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు, రాయదుర్గం ఎస్‌వోటీ పోలీసులు సోదాలు చేశారు. పబ్‌లో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమాచారంతో ఆకస్మిక దాడులు చేశారు. 50 మందిని అదుపులోకి తీసుకొని వారికి పరీక్షలు నిర్వహించారు. అందులో 24 మంది మాదకద్రవ్యాలు స్వీకరించినట్లు నిర్ధారణ అయింది. డీజే గౌరవ్‌తో కలసి పబ్ నిర్వాహకులు డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించారు.

అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. వారికి ముందుగా ఉస్మాినియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. డ్రగ్స్ కోసం వారంతా కోడ్ లాంగ్వేజీలో సంప్రదింపులు జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ సాగిస్తున్నారు. పట్టుబడిన వారిలో మెడికో, ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారు