Auto bodies| ఆటోలో మృతదేహాలు..!

హైదరాబాద్ పాతబస్తీ-చాంద్రాయణగుట్టలో ఆటోలో మృతదేహాలు కలకలం రేపాయి. రోమన్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ కింద నిలిపి ఉన్న ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలను స్థానికులు గమనించారు.

Auto bodies| ఆటోలో మృతదేహాలు..!

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీ-చాంద్రాయణగుట్ట(Chandrayangutta)లో ఆటోలో( Auto bodies) మృతదేహాలు కలకలం రేపాయి. రోమన్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ కింద నిలిపి ఉన్న ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలను స్థానికులు గమనించారు. ఆటోలో మూడు ఇంజెక్షన్లు లభ్యం కావడంతో డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా వారు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఆటోలో లభ్యమైన వారి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులను జహంగీర్‌ (24), ఇర్ఫాన్‌ (25)గా గుర్తించారు. ఘటనాస్థలంలో పోలీస్ క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరించింది. అక్కడ దొరికన మూడు సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. మూడో వ్యక్తి పరారైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తూ కేసును చేధించే ప్రయత్నం చేస్తున్నారు.