విధాత, హైదరాబాద్ : నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్ ను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిసహా పార్టీ నాయకులను అరెస్టు చేయడంపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు, యువకులు చేస్తున్న పోరాటంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహారిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ హాస్పిటల్ వద్ద నిరుద్యోగ యువకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలని హెచ్చరించారు. నిరుద్యోగుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాపాలనలో పరామర్శించటం, నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే నిరుద్యోగులను తరుముతూ పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని ఆరోపించారు. నిరుద్యోగులు, యువకులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ లను వెంటనే జారీ చేయాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభించాలని రేవంత్ రెడ్డి సర్కార్ ను కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు బీఆరెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పోలీసులు అత్యుత్సాహాన్ని మానుకోవాలని హితవు .. పల్లా అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్ ను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిసహా పార్టీ నాయకులను అరెస్టు చేయడంపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు