Polycet 2026 | రేపే పాలిసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌.. ఒక్క నిమిషం ఆల‌స్య‌మైనా అనుమ‌తించ‌రు..!

Polycet 2026 | రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి ప్ర‌వేశాల నిమిత్తం.. ఈ నెల 13న పాలిసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది.

Polycet 2026 | రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి ప్ర‌వేశాల నిమిత్తం.. ఈ నెల 13న పాలిసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. బుధ‌వారం ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష కొన‌సాగ‌నుంది. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు.

పాలిసెట్ ప‌రీక్ష‌కు 1,06,439 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, రాష్ట్ర వ్యాప్తంగా 293 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. అన్ని వ‌స‌తులు ఉన్న కాలేజీల‌నే ప‌రీక్షా కేంద్రాలుగా కేటాయించామ‌ని పేర్కొన్నారు. ఒక్క నిమిషం ఆల‌స్య‌మైనా ప‌రీక్ష కేంద్రంలోకి అనుమ‌తించ‌ర‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో గంట ముందే ప‌రీక్షా కేంద్రానికి చేరుకోవాల‌ని సూచించారు.

విద్యార్థులు తమ వెంట బ్లాక్‌ పెన్సిల్, ఎరేజర్, బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పెన్‌ తప్పకుండా తీసుకురావాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్‌పై ఫొటో ముద్రణ కాకుంటే.. ఒక పాస్‌పోర్టు సైజు ఫొటో, గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి.

13, 14 తేదీల్లో ఐసెట్

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించే ఐసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను కూడా ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వ‌హించేందుకు అధికారులు సిద్ధ‌మ‌య్యారు. 56,223 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం 16 రీజిన‌ల్ సెంట‌ర్ల‌లో 69 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌వేశ ప‌రీక్ష ప్రారంభం కానుంది. నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐసెట్ కన్వీనర్‌ అల్వాల రవి తెలిపారు.

Latest News