Rain Alert | హైద‌రాబాద్ : భ‌గ‌భ‌గ మండుతున్న ఎండ‌ల‌కు, తీవ్రంగా కొన‌సాగుతున్న వ‌డగాల్పుల నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగే అవ‌కాశం ఉంది. ఎందుకంటే జూన్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌ర‌బాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ వ‌ర్షాల‌తో ప్ర‌జ‌ల‌కు ఉక్క‌పోత నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించ‌నుంది.

ప్ర‌స్తుతం ఆయా జిల్లాల్లో 45 డిగ్రీల వ‌ర‌కు ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. రేప‌ట్నుంచి 40 నుంచి 42 డిగ్రీల మ‌ధ్య న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది. ఇక హైద‌రాబాద్ న‌గ‌రంలో 36 నుంచి 38 డిగ్రీల‌కు చేరుకునే అవ‌కాశం ఉంది.

జూన్ 5వ తేదీ త‌ర్వాత‌.. హైద‌రాబాద్ న‌గ‌రంలో 35 నుంచి 36 డిగ్రీల మ‌ధ్య‌, తెలంగాణ వ్యాప్తంగా 38 నుంచి 39 డిగ్రీల మ‌ధ్య ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది. జూన్ రెండో వారంలో నైరుతి రుతుప‌వ‌నాలు రాష్ట్రంలోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంది.

సోమ‌వారం ఈ జిల్లాల‌కు వ‌ర్ష సూచ‌న‌..

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించింది.

మంగ‌ళ‌వారం ఈ జిల్లాల్లో..

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, నారాయ‌ణ‌పేట‌, వ‌న‌ప‌ర్తి, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

బుధ‌వారం రోజున..

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, భువ‌న‌గిరి, న‌ల్గొండ‌, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలుల‌తో కూడిన వాన‌లు ప‌డుతాయ‌ని తెలిపింది.