TG Rains | రేపట్నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!
TG Rains | ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
TG Rains | రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.
ఈ నెల 16వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా సుమారు 20 జిల్లాలో వర్షాలు కురియనున్నాయి. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ వర్షాల కారణంగా ప్రస్తుతం ఉన్న 40 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు 33 నుంచి 35 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉంది.
ఇక శుక్రవారం అత్యధికంగా భద్రాచలంలో 40.2 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతలకు 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే వడగాలులుగా పేర్కొంటారు. ప్రస్తుతం 2.5 డిగ్రీలలోపే ఉండటంతో ఆ పరిస్థితి లేదు. పైగా వానలు కురిసే అవకాశం ఉన్నందున నాలుగైదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram