Telangana BC Reservation Bill : బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గందరగోళం.. స్పందించిన రాజ్‌భవన్
తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన వార్తలు నిజం కాదని రాజ్‌భవన్ స్పష్టం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విధాత): తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన న్యూస్ అవాస్తవమని రాజ్‌భవన్ అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపారు. రిజర్వేషన్ల బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో.. విలీనం చేస్తూ.. జారీ చేసిన మెమోతో ఈ గందరగోళం నెలకొందని వివరించారు.
అయితే.. గత కొన్ని గంటలుగా.. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యిందని.. సోషల్ మీడియాలో, ప్రముఖ టీవీ ఛానల్స్‌లో ప్రచారం అయ్యింది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు, 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ మేరకు స్పందించిన రాజ్‌భవన్ అధికారులు ఇదంతా అవాస్తవమని తేల్చి చెప్పారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram