టీడీపీకి గన్నోజు రాజీనామా.

తెలంగాణ టీడీపీ పరకాల నియోజకవర్గ ఇంచార్జి గన్నోజు శ్రీనివాస చారి ఆపార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీనామా నిర్ణయం వెల్లడించారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ టీడీపీ పరకాల నియోజకవర్గ ఇంచార్జి గన్నోజు శ్రీనివాస చారి ఆపార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. సోమవారం పరకాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనతోపాటు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేస్తున్నామని వెల్లడించారు. 2014 నుంచి నియోజకవర్గంలో గన్నోజు టీడీపీని పట్టుకుని ఉన్నారు. అప్పటి నుంచి ప్రజలకు ఏ సమస్య వచ్చినా తనదైన శైలిలో ప్రతిస్పందిస్తూ వస్తున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీ శ్రేణులను కాపాడేందుకు కృషి చేశారు. ఈ ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కొన్ని నెలలుగా గడపగడపకూ గన్నోజు పేరుతో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటిస్తూ వచ్చారు. తాజాగా టీడీపీ అధిష్టానం తెలంగాణలో పోటీకి దూరంగా ఉంటున్నట్లు చేసిన ప్రకటనతో ఆయన తీవ్ర నిరాశకులోనయ్యారు. గన్నోజు రాజీనామా అభిమానుల్లో ఆవేదన నింపింది. టీడీపీకి ఎదురు దెబ్బ అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలాఉండగా శ్రీనివాసాచారి రాజకీయ భవిష్యత్తు త్వరలో నిర్ణయించుకోనున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీలో చేరుతారన్నది త్వరలో తేలనున్నది.