Narsampet : నర్సంపేటలో రూ.500 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం రేవంత్

నర్సంపేటలో రూ.500 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. రోడ్లు, మెడికల్ కళాశాల, స్కూల్ వంటి కీలక ప్రాజెక్టులు ప్రారంభం.

Narsampet : నర్సంపేటలో రూ.500 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం రేవంత్

విధాత, ప్రత్యేక ప్రతినిధి: నర్సంపేటలో రూ.508 కోట్ల 84 లక్షల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొనడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, అనసూయ సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

రూ. 56.40 కోట్ల వ్యయంతో నర్సంపేట నుండి నెక్కొండ రోడ్డు, రూ. 82.56 కోట్లతో హనుమకొండ -నర్సంపేట- మహబూబాబాద్ రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుకు, నర్సంపేటలో రూ. 26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులకు, రూ.130 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల, వసతి గృహముల నిర్మాణ పనులకు, రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులకు, నర్సంపేట పట్టణంలో రూ. 20.కోట్లతో అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, బీటీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు, రూ.17.28 కోట్ల వ్యయంతో నర్సంపేట నుండి పాకాల రోడ్డు పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రామ చంద్రునాయక్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం డి రియాజ్, ఎం పి బలరాం నాయక్, ఎమ్మెల్సీ లు బస్వరాజు సారయ్య , పింగిలి శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, డాక్టర్ మురళి నాయక్, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Two Years of Congress Rule | ఏలుబడిలో ఎవరున్నా.. ఎక్కడి భూ సమస్యలు అక్కడే!
Hyderabad : అత్మహత్య యత్నం చేసుకున్న సాయి ఈశ్వర్ మృతి