• Telugu News
  • /Telangana

Bhadrachalam Temple | భద్రాచలం అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి ఘాట్, ఆలయ విస్తరణ పనులు చేపడుతున్నారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Mar 27, 2026, 2:22 pm IST
Read Time: 3 mins
Bhadrachalam Temple | భద్రాచలం అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

విధాత : రూ. 351 కోట్లతో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ విస్తరణ తొలిదశ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. రూ.75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి, రూ.180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, రూ.96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రాకారాన్ని నాలుగు వైపులా 20 అడుగుల మేర విస్తరించనున్నారు. మొత్తం రూ.586 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు మూడు దశల్లో చేపట్టనున్నారు. శుక్రవారం భద్రాచలంలోని తూర్పుమెట్ల వద్ద తొలివిడత పనులకు రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు.

భద్రాచలం ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ రెడ్డి 2024 మార్చి 11న ప్రకటన చేశారు. ఇటీవల మాస్టర్ ప్లాన్ విడుదల చేసి రూ.351కోట్లు మంజూరీ చేశారు. అభివృద్ది పనుల శంకుస్థాపన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులు, అధికారులు హాజరయ్యారు.

అంతకుముందు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రేవంత్ రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మిథిల స్టేడియంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

ఇవి కూడా చదవండి :

Telangana Heavy Rains : తెలంగాణకు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్!
నేను, మోదీ చేతల మనుషులం: ట్రంప్‌