ఇంద్రవెల్లిలో గర్జించిన రేవంత్ రెడ్డి

విధాత:ఇంద్రవెల్లి పేరు వింటనే రోమాలు నిక్క పొడుస్తాయి.ఇంద్రవెల్లి ఉద్యమాల ఖిల్లా.ఇంద్రవెల్లి పేరు వింటే రక్తం సల సల మసులుతుంటాది.ఇంద్రవెల్లి అంటేనే త్యాగాలకు మారుపేరు.ఆదివాసుల హక్కుల కోసం ఈ గడ్డ మీదే పోరాటం జరిగింది.తెలంగాణ బిడ్డల భవిష్యత్ దొర గడిలో బందీ ఐనది అందుకే ఇంద్రవెల్లి నుంచే పోరాటం ఇంద్రవెల్లిలో ఆనాటి ఘటనలో చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటాం.కొమురం భీమ్ నీ బాంఛాన్ దొరా కాదు గోల్కొండ కింద ఘోరీ కడుతాం అని నినదించిన గడ్డ.ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు […]

ఇంద్రవెల్లిలో గర్జించిన రేవంత్ రెడ్డి

విధాత:ఇంద్రవెల్లి పేరు వింటనే రోమాలు నిక్క పొడుస్తాయి.ఇంద్రవెల్లి ఉద్యమాల ఖిల్లా.ఇంద్రవెల్లి పేరు వింటే రక్తం సల సల మసులుతుంటాది.ఇంద్రవెల్లి అంటేనే త్యాగాలకు మారుపేరు.ఆదివాసుల హక్కుల కోసం ఈ గడ్డ మీదే పోరాటం జరిగింది.తెలంగాణ బిడ్డల భవిష్యత్ దొర గడిలో బందీ ఐనది అందుకే ఇంద్రవెల్లి నుంచే పోరాటం ఇంద్రవెల్లిలో ఆనాటి ఘటనలో చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటాం.కొమురం భీమ్ నీ బాంఛాన్ దొరా కాదు గోల్కొండ కింద ఘోరీ కడుతాం అని నినదించిన గడ్డ.ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు బానిసలుగా మారారు.దేశానికి దళితుణ్ణి చేసిన చరిత్ర కాంగ్రెస్ ది దళితులను స్పీకర్ గా కేంద్ర హోంమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది.రిజర్వేషన్ పేరుతో బాల్క సుమన్ ఎమ్మెల్యే, ఎంపీ ఐనడు అంటే కాంగ్రెస్ పుణ్యమే బాల్క సుమన్ చదువుకున్న సన్నాసిల మాట్లాడుతున్నాడు.తొలి ముఖ్యమంత్రి దళితున్ని చేస్తా అన్నడు.. రాష్టానికి దళితుడు సీఎంగా ఉన్నాడా.. దరిద్రుడు ఉన్నడా.మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య చేసిన తప్పు ఏందో ఇప్పటివరకు చెప్పలేదు.

ఏప్రిల్ 20 న అమర వీరులకు నివాళులు అర్పించాడనికి కూడా అనుమతి ఇవ్వడం లేదు.. నిర్బందాలను ఛేదించి ఇంద్రవెల్లి వచ్చాను.ఆదివాసుల బిడ్డల కష్టాలను స్వయంగా చూసిన కాంగ్రెస్ పాలన.. కేసీఆర్ నేరాల ఘోరాల పాలన చూడండి.119 నియోజవర్గాల్లో ఉప ఎన్నికలు రావాలి.. అప్పుడే నిధులు ఇచ్చేలా ఉన్నాడు.ఓరి సన్నాసి కేసీఆర్ నీ గజ్వేల్ లో గుంట భూమి అడగలేదు.. ఈ ఏడెల్లలో 15 లక్షలు ఖర్చు పెట్టినవ్ కదా.. ఆదివాసుల కు ఎం చేసినవ్ కేసీఆర్ నరరూప రాక్షసుడిగా మారిండు.బిడ్డను బిర్లాను కొడుకును అంబానిని అల్లుడిని టాటాను చేసిండు.. కేసీఆర్ తాగి ఫామ్ హౌస్ లో పాంటున్నాడు.12 కిలోమీటర్ల దూరంలో సభకు వచ్చే వారిని ఆపిండ్రు.. ఇదెక్కడి న్యాయమో పోలీసులు ఆలోచించుకోవాలి.పోలీసులు కూడా ఆలోచించుకోవాలి.

కొందరు పోలీసులు కేసీఆర్ కు కట్టు బానిసలుగా మారిపోయారు.ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు గుర్తుపెట్టుకో.. మా ప్రభుత్వం వస్తే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఇంద్రవెల్లి లో వంగపెడ్త.నిన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క లక్షకు ఒక్కరు తగ్గిన తల వంచుతా మీ ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక తెప్పించుకో కార్యకర్తల మీద నమ్మకంతోనే లక్ష మంది అని సవాల్ చేసిన కేసీఆర్ ఇంకో 22 నెలలు మాత్రమే ఫామ్ హొజ్ లో ఉండేది.. తర్వాత చర్లపల్లి జైలులోనే
కష్టపడిన కార్యకర్తలను మర్చిపోను.నేను దళితుణ్ణి కాకపోవచ్చు కానీ నల్లమల్ల అడవిలో పుట్టిన బిడ్డను.చెంచుల కష్టాలను కళ్లారా వాణ్ణి ఆదివాసులు, గిరిజనుల కోసం మీ ముందు ఉండే బాధ్యత నాది.తెలంగాణ తల్లి సోనియాగాంధీ.కేసీఆర్ తాగే సారలో సోడా పోసేటోన్ని ఎంపీగా చేసిండు.