Hyderabad | స్పా సెంటర్లపై దాడి.. 8 మంది మహిళలు అరెస్ట్

స్పా సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతున్న స్పా సెంటర్లపై దాడి చేసిన పోలీసులు 8మంది మహిళను, నిర్వాహకులను అరెస్టు చేశారు

  • By: Somu |    telangana |    Published on : May 29, 2024 5:42 PM IST
Hyderabad | స్పా సెంటర్లపై దాడి.. 8 మంది మహిళలు అరెస్ట్

విధాత, హైదరాబాద్‌ : స్పా సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతున్న స్పా సెంటర్లపై దాడి చేసిన పోలీసులు 8మంది మహిళను, నిర్వాహకులను అరెస్టు చేశారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీసులు నాలానగర్‌లోని రెండు స్పాలపై బుధవారం దాడి నిర్వహించారు.

ఈ దాడిలో ఎనిమిది మంది మహిళలతో పాటు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఖచ్చితమైన సమాచారం ఉండడంతో జన్నత్, మ్యాజికల్ ఫ్రెండ్స్ స్పా సెంటర్లపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు మొహమ్మద్ ఆరిఫ్, రూబీ, ఆదిత్యాలను కూడా అదుపులోకి తీసుకున్నారు.