దేశంలోనే పేరోందని సింగరేణి సంస్థను బీఆరెస్ పదేళ్లలో ఆర్థిక విధ్వంసం చేసిందన్న కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్ సామ రాంమోహన్‌రెడ్డి ట్విటర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు
సింగరేణి విధ్వసంపై కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు సామ కౌంటర్
విధాత: దేశంలోనే పేరోందని సింగరేణి సంస్థను బీఆరెస్ పదేళ్లలో ఆర్థిక విధ్వంసం చేసిందన్న కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్ సామ రాంమోహన్‌రెడ్డి ట్విటర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సింగరేణిలో 49% వాటా ఉన్న కేంద్రం సింగరేణిలో ఆర్థిక విధ్వంసం జరుగుతుంటే బీఆరెస్పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని, అంటే అంటే కేంద్రం ఈ పది సంవత్సరాలు గుడ్డి గుర్రం పల్లు తోమిందా? అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు సామ రిప్లై ఇచ్చారు.
పార్లమెంటులో గనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే చట్టాలు చేసి సింగరేణిని విధ్వంసం చేసింది బీజేపీ కాదా? ఆ చట్టాలకు పూర్తి మద్దతునిచ్చింది బీఆరెస్ కాదా? అంటు సామ ప్రశ్నించారు. పది సంవత్సరాలు అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని తమ అవినీతితో ఆర్థిక విధ్వంసం చేసిన బీఆరెస్‌పై ఒక్క విచారణ జరిపించకుండా కాపాడింది ఎవరు? మీరు కాదా? అంటూ సామ రామ్మోహన్ రెడ్డి ట్విట్టర్లో బీజేపీపై విరుచుక పడ్డారు.