SARASWATI NADI PUSHKARALU 2025 | మే 15 నుంచి స‌రస్వ‌తి న‌ది పుష్క‌రాలు.. తెలంగాణ‌లో పుష్క‌ర ఘాట్ ఇదే..!

SARASWATI NADI PUSHKARALU 2025 | గోదావ‌రి( Godavari ), కృష్ణా( Krishna ) పుష్క‌రాల మాదిరే స‌ర‌స్వ‌తి న‌ది పుష్క‌రాలు( Saraswati Nadi Pushkaralu )కూడా ఉన్నాయి. ఈ నెల 15 నుంచి ప్రారంభం కాబోతున్న స‌ర‌స్వ‌తి న‌ది పుష్క‌రాలు తెలంగాణ‌( Telangana )లో ఎక్క‌డ జ‌ర‌గ‌నున్నాయి..? ఆ న‌ది పుష్క‌రాల విశిష్ఠత ఏంటో తెలుసుకుందాం..

SARASWATI NADI PUSHKARALU 2025 | మే 15 నుంచి స‌రస్వ‌తి న‌ది పుష్క‌రాలు.. తెలంగాణ‌లో పుష్క‌ర ఘాట్ ఇదే..!

SARASWATI NADI PUSHKARALU 2025 |  ఏడాదికి ఓ నదికి చొప్పున మొత్తం 12 నదలుకు( Rivers ) 12 సంవత్సరాలుకు ఓసారి పుష్కరాలొస్తాయి. 2025 సంవత్సరంలో సరస్వతి నదికి పుష్కరాలొస్తున్నాయ్. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతి నది  పుష్కరాలు( Saraswati Nadi Pushkaralu ) ప్రారంభ‌మ‌వుతాయి. మే 15 నుంచి మే 26 వరకు మొత్తం 12 రోజుల పాటు వైభవంగా పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల సమయంలో భక్తులంతా పుణ్యస్నానాలు ఆచరించి, పితృకర్మలు నిర్వహించి పునీతులు అవుతారు. అయితే సరస్వతీ నదీ( Saraswati River ) ఎక్కడా కూడా ప్రత్యేకంగా ప్రవహిస్తూ కనిపించ‌దు. అంతర్వాహినిగా ఉంటుంది.

ముక్తీశ్వర లింగానికి వున్న నాసిక రంధ్రాల గుండా ఎంత నీరు పోసినా బయటికి రాకుండా భూమార్గంలో ప్రవహించి సరస్వతి నదిరూపంలో గోదావరి( Godavari ), ప్రాణహిత( Pranahitha ) నదులతో కలిసి త్రివేణి సంగమం( Triveni Sangamam )గా ఏర్పడిందని చెబుతారు. అందుకే సరస్వతీ నదికి గుప్త కామినీ అనే మరో పేరుంది. కాశీ క్షేత్రంలానే కాళేశ్వరం( Kaleshwaram ) కూడా పిండ ప్రదానానికి ముఖ్యమైన క్షేత్రం అని చెబుతారు. కాశీ( Kashi )కి వెళ్ల లేని వాళ్ళు ఇక్కడ గోదావరి-ప్రాణహిత-సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తెలంగాణలోని భూపాల‌ప‌ల్లి జిల్లా( Bhupalapally ) కాళేశ్వ‌రం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని” స‌ర‌స్వ‌తీ న‌దీ పుష్క‌రాలకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్ప‌టికే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ( Konda Surekha ) స‌రస్వ‌తి న‌ది పుష్క‌రాల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. అత్యంత ప‌విత్ర‌మైన ఈ త్రివేణి సంగ‌మ స్నానానికి ల‌క్ష‌ల మంది భ‌క్తులు రాష్ట్రం నుంచే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా వ‌స్తార‌ని తెలిపారు. పుష్కరాలు ప్రారంభ‌మ‌య్యే నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. చలువ పందిళ్లు, టెంట్‌లు, శాశ్వత మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివ‌రించారు. కాళేశ్వ‌రానికి సంబంధించిన వివ‌రాల‌న్నీ ఆయా వెబ్ సైట్, యాప్ ద్వారా తెలియజేయాల‌న్నారు.

పీఠాధిపతుల పవిత్ర పుష్కర స్నానం

సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు ఒక పీఠాధిపతి ఈ పుష్కర స్నానం చేయనున్నట్టు మంత్రి కొండా తెలిపారు. పుష్కర ప్రారంభం మే 15, 16వ తేదీన శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్ నుంచి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని సరస్వతి పుష్కరాలు ప్రారంభిస్తారన్నారు.