Seethakka : కవిత ఎపిసోడ్ ఓ పెద్ద రాజకీయ కుటుంబ డ్రామా

కవిత సస్పెన్షన్ ఓ పెద్ద రాజకీయ కుటుంబ డ్రామా అని మంత్రి సీతక్క అన్నారు. కాళేశ్వరం అవినీతి బయటపడటంతోనే ఈ గొడవలు మొదలయ్యాయన్నారు.

Seethakka : కవిత ఎపిసోడ్ ఓ పెద్ద రాజకీయ కుటుంబ డ్రామా

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్(BRS) నుంచి కవిత సస్పెండ్ ఎపిసోడ్ ఓ పెద్ద రాజకీయ కుటుంబ డ్రామా అని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క(Seethakka) అన్నారు. కవిత ఎపిసోడ్ పై సీతక్క మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. కేటీఆర్(KTR) ప్రోత్సాహం లేనిది కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. కేటీఆర్ ను కవిత వెనకేసుకురావడం పెద్ద డ్రామాగా ఉందన్నారు. మొదట కేటీఆర్ ను టార్గెట్ చేసిన కవిత(Kavitha) ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేశారన్నారు. కేసీఆర్(KCR) కుటుంబం అంతా ఒకటేనని..వారంతా భవిష్యత్తులో అందరూ కలిసి పోతారన్నారు. కవితను విమర్శించిన మహిళా నేతలే నష్టపోతారన్నారు. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్….. తన కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో ఉన్నాడా? అని సీతక్క సెటైర్లు వేశారు. నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేడా? అని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో(Kaleshwaram Project) కేసీఆర్ కుటుంబం అవినీతి బయట పడేసరికి ఈ గొడవలను తెరమీదకు తెచ్చారన్నారు. అవినీతి సొమ్ము, అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు గొడవలు పడుతున్నారన్నారు. సంతోష్ రావు(Santosh Rao) బినామీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రూ. వందల కోట్లు సంపాదించారని కవిత ఆరోపించిందని..ములుగులో నన్ను ఓడించేందుకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వందల కోట్లు ఖర్చు చేశాడని సీతక్క విమర్శించారు.