విధాత, వరంగల్ ప్రతినిధి:జనగామ జిల్లా పాలకుర్తిలోని గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బాలికను లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుకుంటున్న బాలికపై క్యాటరింగ్ వర్కర్ నిత్యం లైంగికంగా వేధించడంతో ఆ మైనర్ బాలిక సెలవులకు ఇంటికి వెళ్లి తిరిగి పాఠశాలకు రాకపోవడంతో విషయం బయటకు వచ్చింది. పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని బాలిక తల్లిదండ్రులు ప్రశ్నించగా గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ గా పనిచేస్తున్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాలిక తల్లిదండ్రులకు వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు గురుకుల పాఠశాలకు వచ్చి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు క్లాస్ టీచర్ ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని తమకి ఏమి తెలియదు అంటూ దాటవేశారని తెలిపారు. దీంతో వేధింపులకు పాల్పడిన క్యాటరింగ్ వర్కర్ పై పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Telangana | గురుకుల పాఠశాల విద్యార్థికి లైంగికవేధింపులు
జనగామ జిల్లా పాలకుర్తిలోని గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బాలికను లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Latest News
రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ మళ్లీ వెనుకబాటు: హరీష్ రావు
బర్త్ డే రోజున..సోనియాగాంధీకి కోర్టు షాక్
మీ బండారం విప్పితే..తట్టుకోలేవు: ఎమ్మెల్యే మాధవరం
2లక్షల మార్క్ వైపు.. వెండి ధర పరుగు
ఐపీఎల్ తెచ్చిన క్రేజ్.. అండర్-14 సెలక్షన్ కు క్యూలైన్స్
జపాన్లో భూకంపం..
షాకింగ్ వీడియో..ఆకాశంలో పక్షిని వేటాడిన పాము!
విజయ్ సభలో గన్ తో కార్యకర్త కలకలం
స్వయం పాలనకు స్ఫూర్తి తెలంగాణ తల్లి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ లో రికార్డు పెట్టబడులు