TELANGANA | గురుకులంలో మల్లన్న గుడి నిర్మించాలి

గురుకులంలో మల్లన్న గుడి నిర్మిస్తే శాంతిస్తానని..ఆలయం నిర్మింకపోతే ఇలాంటి ఘటనలు పునరా వృతమౌతాయంటూ ఓ విద్యార్థి తల్లి ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడిపోయి కేకలు వేస్తూ పూనకం వచ్చినట్లు ఊగిపోయి పొర్లు దండాలు పెట్టింది.

TELANGANA | గురుకులంలో మల్లన్న గుడి నిర్మించాలి

అప్పుడే శాంతిస్తానంటూ విద్యార్థి తల్లి పూనకం
లేకపోతే ఇలాంటి ఘటనలే పునరావృతమవుతాయని జోస్యం

విధాత, హైదరాబాద్ : గురుకులంలో మల్లన్న గుడి నిర్మిస్తే శాంతిస్తానని..ఆలయం నిర్మింకపోతే ఇలాంటి ఘటనలు పునరా వృతమౌతాయంటూ ఓ విద్యార్థి తల్లి ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడిపోయి కేకలు వేస్తూ పూనకం వచ్చినట్లు ఊగిపోయి పొర్లు దండాలు పెట్టింది. ఈ వ్యవహారం వైరల్‌గా మారింది. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కౌశిక్ అనే విద్యార్థి తల్లి కృష్ణవేణికి పూనకం వచ్చి కింద పడిపోయి నాది నాగదేవత రూపం, ఇక్కడ ఆలయం నిర్మించి నిత్యపూజలు చేయకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయంటూ ఆ మహిళ స్పష్టం చేసిన వీడియో వైరల్ అవుతుంది. గడిచిన 20 రోజులలో పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, నలుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిసరాల్లో ఉన్న పాముల పుట్టలు నుంచి పాముల బయట పడడం మరింతగా అనుమానాలకు బలం చేకూరుస్తుంది. దీనికి తోడు పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు వచ్చిన ఓ విద్యార్థిని తల్లి పూనకంతో ఊగిపోతూ తనను ఎవరూ పట్టించుకోవట్లేదని,గురుకులంలో మల్లన్న గుడినిర్మించి నిత్యపూజలు చేస్తే శాంతిస్తానంటూ చెప్పడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.