గురుకులాల్లో పనివేళలు కుదించండి: బండి సంజయ్

గురుకులాలకు రూపొందించిన కొత్త టైమ్ టేబుల్‌ పనివేళలు కుదించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు

గురుకులాల్లో పనివేళలు కుదించండి: బండి సంజయ్

సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లేఖ
కరీంనగర్ పోలీసులకు టీఏ, డీఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లింపుకు వినతి

విధాత, హైదరాబాద్‌: గురుకులాలకు రూపొందించిన కొత్త టైమ్ టేబుల్‌ పనివేళలు కుదించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఉదయం 5 నుండి రాత్రి 9.30 గంటల వరకు పనివేళలు రూపొందించడంవల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వెల్లడించారు. రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను కూడా టీచర్లకు అప్పగించడం సరికాదన్నారు. వార్డెన్ల పోస్టులు మంజూరైనా భర్తీ చేయకపోవడం బాధాకరమని, తక్షణమే వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డీఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించకపోవడం దారుణమన్నారు. వివిధ విభాగాల్లోని దాదాపు వెయ్యి మంది పోలీసులు తీవ్ర ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం కరీంనగర్ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడం బాధాకరమని గుర్తు చేశారు. తక్షణమే వారికి టీఏ, డీఏ, పీఆర్సీ బకాయిలతోపాటు సరెండ్ లీవ్ బిల్స్ చెల్లించాలని లేఖలో కోరారు.