Nalgonda : దారుణం.. ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మహిళ !

వివాహేతర సంబంధం నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆరు నెలల శిశువుకు గాయాలయ్యాయి.

Nalgonda : దారుణం.. ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మహిళ !

విధాత: ప్రియుడి భార్యపై ఓ మహిళ పెట్రోల్ పోసి తగలబెట్టిన దారుణ ఘటన సంచలనం రేపింది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నగేష్ యాదవ్ కు సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో గొడవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నగేష్ భార్యతో గొడవపడిన సుజాతా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో భారీగా చెలరేగిన మంటలతో నగేష్ భార్య అక్కడికక్కడే మంటల్లో కాలి మరణించింది. ఈ గొడవ సందర్భంగా ఆరు నెలల బాలుడికి కూడా గాయాలయ్యాయి.

ఇటీవల ఏపీలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన వివాహితుడు అలంకుంట మల్లేశ్ కు, తెనాలి సీఎం కాలనీకి చెందిన వివాహిత దుర్గ అనే మహిళకు మధ్య వివాహేతర సంబంధం నేపథ్యంలో వివాదం రగిలింది. దీంతో దుర్గ ఆవేశంతో ప్రియుడి మల్లేశ్ ఇంటిపైకి వెళ్లి అతడి భార్య, కుమారుడు అరుణ్, మల్లేశ్ తల్లి పద్మలపైన, ఇంటి మీదకూడా పెట్రోల్ చల్లి నిప్పంటించింది.ఈ ఘటనలో వారంతా గాయాలపాలవ్వడం తెలిసిందే. ఈ తరహా ఘటనలు అవాంఛనీయ సంబంధాల దుష్ఫలితాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

Family Suicide : రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
Medaram  Traffic Collapse | కుప్పకూలిన మేడారం ట్రాఫిక్ నియంత్రణ.. 14 గంటలపాటు భక్తులకు నరకం