SIT Raids On Mithun Reddy Residence | వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి నివాసాల్లో సిట్ సోదాలు
ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి నివాసాల్లో సిట్ సోదాలు. కుటుంబ సభ్యులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు.
అమరావతి : ఏపీ లిక్కర్ కేసులో ఏ 4గా ఉన్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, తిరుపతి, బెంగుళూర్ నివాసాలలో, కార్యాయాల్లో నాలుగు బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల సందర్భంగా మిధున్ రెడ్డి కుటుంబ సభ్యులను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సోదాల సమయంలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కూడా మిధున్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు.
మిధున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేసి.. అక్రమార్జనను షెల్ కంపెనీలకు తరలించారంటూ సిట్ ఆరోపిస్తుంది. మిధున్ రెడ్డిని ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని విచారించారు. జ్యూడిషియల్ రిమాండ్ లో కూడా ఉన్నారు. కోర్టు బెయిల్ పై 71రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మిధున్ రెడ్డి తాజాగా తనపై సిట్ సోదాలపై స్పందించారు. ఏం జరుగుతుందో తనకు తెలియదని..ఇప్పటికే నన్ను సిట్ విచారించిందని గుర్తు చేశారు. తాజాగా సోదాల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని మిధున్ రెడ్డి ఆరోపించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram