Murder | అత్తపై అల్లుడు లైంగికదాడి.. గొంతు నులిమి హత్య
Murder | మద్యం మత్తులో ఓ వ్యక్తి క్రూరమృగంలా మారాడు. పిల్లనిచ్చిన అత్తపై లైంగికదాడికి పాల్పడి పైశాచిక ఆనందం పొందుతూ రాక్షసుడిలా ప్రవర్తించాడు. అల్లుడి( Son in Law ) ఆగడాలు భరించలేని అత్త.. అతన్ని గొంతు నులిమి హత్య చేసింది.

Murder | మద్యం మత్తులో ఓ వ్యక్తి క్రూరమృగంలా మారాడు. పిల్లనిచ్చిన అత్తపై లైంగికదాడికి పాల్పడి పైశాచిక ఆనందం పొందుతూ రాక్షసుడిలా ప్రవర్తించాడు. అల్లుడి( Son in Law ) ఆగడాలు భరించలేని అత్త.. అతన్ని గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా( Nirmal District ) ముథోల్ మండలం తరోడలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర( Maharashtra )లోని హిమాయత్‌నగర్‌కు చెందిన షేక్ నజీం(45) తన భార్య, కుమారుడు, అత్త(68)తో కలిసి పదేండ్ల క్రితం తరోడ గ్రామానికి వలస వచ్చాడు. షేక్ నజీం, అతని భార్య కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొంతకాలం నుంచి నజీం మద్యానికి బానిస అయ్యాడు. పది రోజుల క్రితం నజీం భార్య కూలీ పనుల నిమిత్తం మహారాష్ట్రలోని శివుని గ్రామానికి వెళ్లింది.
ఇక ఒంటరిగా ఉన్న అత్తపై నజీం కన్నేశాడు. మద్యం మత్తులో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో అస్వస్థతకు గురైన బాధితురాలు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగొచ్చింది. సోమవారం అర్ధరాత్రి మరోసారి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. సహనం కోల్పోయిన అత్త.. అల్లుడిపై కర్రతో దాడి చేసి, గొంతు నులిమి హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.