Speaker vs Harish Rao | ఏదో సాధిద్దామంటే కుదరదు.. హరీశ్‌రావుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వార్నింగ్
Speaker vs Harish Rao | శాసనసభలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమెకు సీఎం క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. సబితకు మైక్ ఇవ్వాలని పట్టుబట్టారు. స్పీకర్ పోడియంలోకి బీఆర్ఎస్ సభ్యులు దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Speaker vs Harish Rao | హైదరాబాద్ : శాసనసభలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమెకు సీఎం క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. సబితకు మైక్ ఇవ్వాలని పట్టుబట్టారు. స్పీకర్ పోడియంలోకి బీఆర్ఎస్ సభ్యులు దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్రంగా స్పందించారు. అన్ డెమోక్రసీ, అన్‌పార్లమెంటరీ పద్ధతుల్లో చైర్‌పై ఒత్తిడి తీసుకొచ్చి ఏదో సాధిద్దామంటే కుదరదు అని హరీశ్‌రావుకు స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు. సభా మర్యాదలను కాపాడాలని, తప్పకుండా సబితకు మైక్ ఇస్తానని స్పీకర్ చెప్పారు. అయినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. నిలబడి ఉంటే మైక్ అసలు ఇవ్వను అని తేల్చిచెప్పారు స్పీకర్.
ఇది మంచి పద్ధతి కాదు.. నిన్న కేటీఆర్ కూడా సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. సభా మర్యాదలను కాపాడండి. రాజకీయాలు చేస్తే నేనేం చేయలేను. మీరు కూర్చొంటేనే మైక్ ఇస్తను. లేచి నిలబడి ఆందోళన చేస్తేమైక్ ఇచ్చే ప్రసక్తే లేనే లేదు. సభా గౌరవాన్ని కాపాడండి. ఎన్నిసార్లు రెక్వెస్టు చేసినా వినిపించుకోవడం లేదని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సభ్యులను ఆందోళనల్లో భాగం చేసి వారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. కావాలని ఎందుకు చేస్తున్నారు. వ్యక్తిగత విషయాలను సభలోకి తీసుకొచ్చి రాజకీయంచేయడం సరికాదు అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.