Takkallapally Srinivasa Rao | వరంగల్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలి

వరంగల్ జిల్లా అభివృద్ధి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా కమిటీ సమావేశం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు

Takkallapally Srinivasa Rao | వరంగల్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలి

విధాత, వరంగల్ ప్రతినిధి:వరంగల్ జిల్లా అభివృద్ధి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా కమిటీ సమావేశం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కందిక చెన్నకేశవులు అధ్యక్షత వహించారు, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. కులం, మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలకు కాలం చెల్లిందన్నారు. లౌకిక దేశమైన భారత దేశంలో ఎన్నటికైనా మత రాజకీయాలు, మతోన్మాద శక్తులు అంతరించిపోక తప్పదని అన్నారు. కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేందుకే పని చేసిందని, పేదలు, మద్య తరగతి వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. దళితుల, గిరిజనుల, మైనారిటీలపై బీజేపీ హయాంలో దాడులు పెరిగాయని, చివరకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలను కూడా ద్వంసం చేశారన్నారు. పార్లమెంటు ఎన్నికలలో బీజేపీని మెజారిటీ ప్రజలు వ్యతిరేకించారని, అయినా మోడీ వైఖరిలో మార్పు రాలేదన్నారు. కమ్యూనిస్టులు, లౌకిక శక్తులతోనే ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణ సాధ్యమని అన్నారు. రానున్న రోజులలో పార్టీ బలోపేతానికి సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు కృషి చేయాలని కోరారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత,వెనుకబడిన వరంగల్ జిల్లా నిర్లక్ష్యానికి గురైంది,మరిన్ని నిధులు కేటాయించాలని జిల్లా అభివృద్ధి చేయులని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మేకల రవి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పంజాల రమేష్, సహయ కార్యదర్శి ఎస్ కె బాష్మియా,జిల్లా నాయకులు పనాస ప్రసాద్, దండు లక్ష్మణ్,బుస్సా రవీందర్,గన్నారపు రమేష్,గుండే బద్రి, వీరగోని శంకరయ్య,మునీశ్వరుడు,సంగి యెలెందర్, తల్లాపెల్లి రాహెల,జన్ను రవి,ఆరెల్లి రవి,దామెర కృష్ణ, ఓర్సు రాజు, అంజద్ , జన్ పాల్, తదితరులు పాల్గొన్నారు