MLC Kavitha | కవిత బెయిల్ విచారణ 27కు వాయిదా
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆరెస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది

MLC Kavitha | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Case)లో బీఆరెస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు Supreme Court)లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ కేసులో ఈడీకి కౌంటర్ దాఖలు చేసేందుకు ఈనెల 23 వరకు సమయం ఇచ్చిన న్యాయస్థానం విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. గడువులోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది.
బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టులలో కవిత చేసిన ప్రయత్నాలు ఫలించికపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. లిక్కర్ కేసులో కవితను ఈడీ మార్చి 15న అరెస్టు చేసింది. అప్పటి నుంచి కవిత తీహార్ జైలులోనే ఉంటున్నారు. జైలులో ఏప్రిల్ 24న సీబీఐ కూడా అరెస్టు చేసింది. లిక్కర్ కేసులో ఇటీవల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా పలువురు నిందితులకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ వస్తుందన్న ఆశ బీఆరెస్ వర్గాల్లో వ్యక్తమవుతుంది.