Takkallapalli Srinivasa Rao | ఆగస్టు 22 నుండి సీపీఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు: తక్కళ్లపల్లి
భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 22 నుండి 24 వరకు మూడు రోజుల పాటు హనుమకొండలో జరుగనున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
హాజరు కానున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు వెల్లడి
Takkallapalli Srinivasa Rao | విధాత, వరంగల్ ప్రతినిధి: భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 22 నుండి 24 వరకు మూడు రోజుల పాటు హనుమకొండలో జరుగనున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం హనుమకొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చారిత్రక నగరం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ వేదికగా ఈ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డీ. రాజా D.Raja), జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె. నారాయణ (Narayana), మాజీ ఎంపీ అజీజ్ పాషా హాజరు కానున్నట్లు తెలిపారు.
ఈ సమావేశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై, దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సీ.హెచ్. రాజా రెడ్డి, నేదునూరి జ్యోతి, హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్,ఆదరి శ్రీనివాస్, నాయకులు బాషబోయిన సంతోష్, కొట్టెపాక రవి, జక్కుల రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram