రైతు రుణమాఫీపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

రైతు రుణమాఫీపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీపై చర్చించారు

  • By: Somu |    telangana |    Published on : Jun 21, 2024 5:49 PM IST
రైతు రుణమాఫీపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

2023డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలు ఏకకాలంలో మాఫీ

విధాత : రైతు రుణమాఫీపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీపై చర్చించారు. ఆగస్టు 15వ తేదీలోగా 2లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 2023డిసెంబర్ 9వ తేదీకి ముందు తీసుకున్న రైతు రుణాలను ఏక కాలంలో మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించారు. అలాగే పలు ఇతర కీలక అంశాలపై కూడా కేబినెట్ చర్చలు కొనసాగుతున్నాయి.