తెలంగాణ కేబినెట్ లో ప్రజలు కొత్త మంత్రులను, ముఖ్యంగా యువ మంత్రులను చూడాలని అనుకుంటున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా జెన్ జీ యువతరం నేపథ్యంలో తనలాంటి యువ ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే బాగుంటుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంజనీర్లు, డాక్టర్ వంటి ఉన్నత చదువులు చదువుకున్న తన లాంటి యువ ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వాలని కోరుకోవడంలో తప్పులేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో మంత్రివర్గంలో యువ నేతలను మంత్రులుగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని, మీడియాలో సైతం ఎక్కువగా ఇదే అభిప్రాయం వినిపిస్తుందన్నారు. ఎక్కువ మంది సీనీయర్లతో కూడిన రాష్ట్ర కేబినెట్ కు రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిపోయిందని, మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు అసరమన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతుందని అనిరుధ్ రెడ్డి అన్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా..పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్, పార్టీ ఇంచార్జ్, ఢిల్లీ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని, అంతా వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్బంగా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఊహగానాల నేపథ్యంలో అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
తనలాంటి యువ ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కొత్త మంత్రివర్గంలో యువ నేతలను మంత్రులుగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
పదవుల కేటాయింపుపై అధిష్టానం, సీఎం రేవంత్రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి… pic.twitter.com/3LQgUvEXV0
— Telangana First (@TelanganaFirst_) July 27, 2026
