Chicken Shops Bandh In TG | తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్

మార్జిన్ పెంపు డిమాండ్‌తో తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్. ధరలు పెరిగే అవకాశం ఉండటంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.

Chicken Shops Bandh In TG

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపుల బంద్ ప్రారంభకానుంది. మార్జిన్ పెంచాలన్న డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల రిటైల్ చికెన్ షాపులను బంద్‌ చేస్తున్నట్లు చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ పాటిస్తామని, గతం కన్నా రూ.20 మార్జిన్ తక్కువ ఇస్తున్నారని, దీంతో వ్యాపారులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ పేర్కొంది. గతంలో మాదిరిగానే మాకు మార్జిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

గతంలో ఫౌల్ట్రి వాళ్ళు రిటైల్ షాపులకు కేజీకి 26 రూపాయలు మార్జిన్ ఇచ్చే వారని, గత 20 ఏళ్ళుగా 26 రూపాయలే మార్జిన్ ఉందని, కానీ ఇటీవల మార్జిన్‌ను16 రూపాయలకు తగ్గించారని, ప్రస్తుతం కేజీ చికెన్‌కు మార్జిన్ 30 రూపాయలు చేయాలని అసోసియేషన్ పేర్కొంది. ప్రస్తుతం చికెన్‌ విక్రయాలపై వస్తున్న లాభం చాలా తక్కువగా ఉండటంతో షాపులు నిర్వహించడం కష్టంగా మారిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు జీవనోపాధి కొనసాగించడం సవాల్‌గా మారిందని వాపోయారు. మార్జిన్‌ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తూ, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బంద్ కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

అసలే వేసవి కాలంలో చికెన్‌కు ఉన్న డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ధరలు మరింత పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బంద్‌ దీర్ఘకాలం కొనసాగి మార్కెట్‌ లో చికెన్ ధరలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు త్వరగా జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని వ్యాపారులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి :

CAG Report | బాంబు పేల్చిన కాగ్‌ రిపోర్ట్‌… తెలంగాణ బడ్జెట్ లోపాలు బట్టబయలు.. లక్ష్యాలకు 76% మాత్రమే అమలు
Bullet Rail Project | బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టు.. శంషాబాద్‌లో 500 ఎక‌రాల భూమి కేటాయింపు

Latest News