Kurnool Bus Tragedy : బస్సు ప్రమాద మృతులు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం
కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో 19 మంది సజీవదహనం కాగా, మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
విధాత; హైదరాబాద్ : కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
బస్సు ప్రమాదంలో చనిపోయిన 19మంది మృతదేహాలను ఇప్పటివరకు వెలికి తీశారు.మృతదేహాల గుర్తింపు కొనసాగుతుంది. ప్రమాద సమయంలో ఇద్దరు డ్రైవర్లు సహా 42మంది ఉన్నారు. ప్రమాదంలో బస్సు ఢీకొన్న బైక్ ను నడుపుతున్న శివశంకర్ సైతం మృతి చెందాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram