Gaddar Awards | గద్దర్ అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గద్దర్ అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు దివంగత గద్దర్ పేరిట ఇవ్వనున్న పురస్కారాలకు విధివిధానాల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది
గద్దర్ పురస్కారాల విధివిధానాల కమిటీ ఏర్పటు
విధాత : గద్దర్ అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు దివంగత గద్దర్ పేరిట ఇవ్వనున్న పురస్కారాలకు విధివిధానాల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీకి చైర్మన్ గా దర్శకుడు బి. నర్సింగరావును, వైస్ చైర్మన్ గా నిర్మాత బి. వెంకట రమణారెడ్డి(దిల్ రాజు)లను నియమిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. సలహా సభ్యులుగా కే. రాఘవేంద్రరావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, గుమ్మడి వెన్నెల, తనికెళ్ల భరణి, డి. సురేష్ బాబు, కే.చంద్రబోస్, ఆర్. నారాయణ మూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సాన యాదిరెడ్డి, హరీష్ శంకర్, యేల్దండి వేణులను నియమించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram