Telangana : నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్
నేపాల్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పౌరుల కోసం ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టింది.
న్యూఢిల్లీ: ప్రస్తుతం నేపాల్‌లో(Nepal) అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో(Telangana Bhavan) ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను(Emergency Helpline) ఏర్పాటు చేసింది. దీని ద్వారా నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం చేయనున్నట్లు వెల్లడించింది.
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నేపాల్‌లో తెలంగాణ పౌరులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. నేపాల్‌లో ఎవరైనా తెలంగాణ(Telangana) పౌరులు చిక్కుకుంటే వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులను ఈ కింది నంబర్ల ద్వారా సంప్రదించవచ్చుని ప్రభుత్వం వెల్లడించింది.
వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రెటరీ & లైజన్ హెడ్.
+91 9871999044.
జి.రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్.
+91 9643723157.
సిహెచ్. చక్రవర్తి, ప్రజా సంబంధాల అధికారి
+91 9949351270.
తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యులు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని సూచించింది. తెలంగాణ పౌరులకు నేపాల్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram