Azharuddin : మంత్రి అజారుద్ధీన్ కు మైనార్టీ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖలు
మంత్రి అజారుద్ధీన్‌కు మైనార్టీ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖల బాధ్యతలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయనకు రెండు కీలక శాఖలు అప్పగించారు.
విధాత, హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ లో కొత్తగా చేరిన మంత్రి మహ్మద్ అజారుద్ధీన్ కు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు ప్రభుత్వం రంగ సంస్థల శాఖలను అజారుద్దీన్ కు కేటాయించారు. ప్రస్తుతం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వద్ద, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్ధ ఉన్నాయి. ఇక మీదట ఆ రెండు శాఖలకు అజారుద్ధీన్ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు.
మంత్రిగా అజారుద్దీన్ ఆక్టోబర్ 31న పదవి ప్రమాణ స్వీకారం చేశారు ఆయనను ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నామినెట్ చేసింది. అయితే ప్రస్తతం ఆ ఫైల్ గవర్నర్ వద్ధ పెండింగ్ లో ఉంది. అసెంబ్లీ, మండలిలో సభ్యుడిగాలేని అజారుద్ధీన్ ఆరు నెలలలోపు ఏదేని సభలో సభ్యుడిగా ఎంపికవ్వాల్సి ఉంది. లేనట్లయితే ఆయన మంత్రి పదవికి అనర్హుడవుతారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram