OTT Movies | వాలెంటైన్స్ వీక్ తర్వాత ఓటీటీల్లో మూవీ మేళా.. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాల జాబితా
OTT Movies | వాలెంటైన్స్ డే వీక్ ముగిసిన వెంటనే ఓటీటీ ప్రియులకు మరోసారి ఎంటర్టైన్మెంట్ జాతర మొదలుకానుంది. సంక్రాంతి బరిలో సందడి చేసిన పెద్ద సినిమాల నుంచి చిన్న బడ్జెట్ లవ్ స్టోరీలు, థ్రిల్లర్లు వరకు పలు చిత్రాలు ఈ వారం ఓటీటీల్లోకి అడుగుపెడుతున్నాయి.
OTT Movies | వాలెంటైన్స్ డే వీక్ ముగిసిన వెంటనే ఓటీటీ ప్రియులకు మరోసారి ఎంటర్టైన్మెంట్ జాతర మొదలుకానుంది. సంక్రాంతి బరిలో సందడి చేసిన పెద్ద సినిమాల నుంచి చిన్న బడ్జెట్ లవ్ స్టోరీలు, థ్రిల్లర్లు వరకు పలు చిత్రాలు ఈ వారం ఓటీటీల్లోకి అడుగుపెడుతున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, రొమాంటిక్ డ్రామాలు, యాక్షన్ సినిమాలు ఇలా అన్ని జానర్లకు చెందిన కంటెంట్ అందుబాటులోకి రానుండడంతో సినీ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీగా కనిపిస్తోంది.
ఈ వారంలో ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ నెల 20 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మన శంకర వరప్రసాద్ గారు ఇప్పటికే అదే ప్లాట్‌ఫామ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు ప్రస్తుతం Netflixలో పలు భాషల్లో అందుబాటులో ఉంది. బాలీవుడ్ నటి సన్నీ లియోన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ కెన్నడీ కూడా ఈ నెల 20 నుంచి ZEE5లో రానుంది. మలయాళ స్టార్ నివిన్ పౌలీ కీలక పాత్రలో నటించిన బేబీ గర్ల్ Sony LIVలో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.
ఇవే కాకుండా యాక్షన్–మైథలాజికల్ టచ్‌తో వచ్చిన వనవీర Amazon Prime Videoలో, ట్రయాంగిల్ లవ్ స్టోరీ మరువ తరమా మరియు రూరల్ ఎమోషనల్ డ్రామా శ్రీ చిదంబరం గారు ETV Winలో స్ట్రీమింగ్ కానున్నాయి. అంతేకాకుండా Netflix, Prime Video, JioHotstar, Apple TV Plus, Sun NXT, Manorama Max వంటి పలు ప్లాట్‌ఫామ్‌ల్లో ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ భాషలకు చెందిన వెబ్ సిరీస్‌లు, అంతర్జాతీయ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.
మరిన్ని ఓటీటీ మూవీస్/ వెబ్ సిరీస్‌లు
అమెజాన్ ప్రైమ్ వీడియో – ది హంట్స్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ), ఈజ్ దిస్ థింగ్ ఆన్ (ఇంగ్లీష్ మూవీ), బ్యాండ్ వాలే (హిందీ తెలుగు వెబ్ సిరీస్), లవ్ మీ లవ్ మీ (ఇంగ్లీష్ మూవీ), ఘోస్ట్స్ ఇన్ ట్రబుల్, ఐయామ్ గాడ్, ఇక్కీస్ (హిందీ మూవీ).
నెట్ ఫ్లిక్స్ – దిస్ ఈజ్ (ఇంగ్లీష్ మూవీ), మోటర్ వ్యాలీ (మూవీ), తలైవర్ తంబీ తలైమైయిల్ (తమిళ మూవీ), కొహర్రా (హిందీ తెలుగు వెబ్ సిరీస్), లీడ్ చిల్డ్రన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్), జాయ్స్ కాలేజ్ రోడ్ ట్రిప్ (ఇంగ్లీష్ తెలుగు మూవీ), ది మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (ఇంగ్లీష్ మూవీ), ది ఆర్ట్ ఆఫ్ సారా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్).
జియో హాట్ స్టార్ – ది బర్డ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్), ప్రెడేటర్ బ్యాడ్ ల్యాాండ్స్ (ఇంగ్లీష్ మూవీ), ది కంజూరింగ్ – లాస్ట్ రైట్స్ (ఇంగ్లీష్ తెలుగు మూవీ).
జీ5 – ఉత్తర్ (మరాఠీ మూవీ)
యాపిల్ టీవీ ప్లస్ – ఎటర్నిటీ (ఇంగ్లీష్ మూవీ).
ఈటీవీ విన్ – బామ్మ చెప్పిన కథ
మనోరమ మ్యాక్స్ – ది ప్రొటక్టర్ (మూవీ), రసా (మూవీ)
సింప్లీ సౌత్ – థియేటర్ : ది మిత్ ఆఫ్ రియాలిటీ (మలయాళం మూవీ)
సన్ నెక్స్ట్ – సూర్య – పవర్ ఆఫ్ లవ్.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram