local Body Elections | రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని మీడియాకు వెల్లడించారు.

local Body Elections | రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్

విధాత, హైదరాబాద్ :
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని మీడియాకు వెల్లడించారు. గతంలో హైకోర్టు తీర్పు ఆధారంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని తెలిపారు. తాజాగా హైకోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్దమయినట్లు చెప్పారు. కాగా, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు విడతల్లో నిర్వహించనున్న రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని చెప్పారు.

తొలి విడత డిసెంబర్ 11న, రెండో విడుత 14 వ తేదీన నిర్వహించనుండగా 17వ తేదీని మూడో విడుత ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుండగా.. అదే రోజు రెండు గంటలకు కౌంటింగ్.. ఫలితాల వెల్లడిస్తామని తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో మూడు విడుదల ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాణి కుముదిని చెప్పారు. దీంతో ఈరోజు(మంగళవారం) నుంచి ఎన్నికల కోడ్ అమలు లోకి రానున్నట్లు వివరించారు.

మొత్తం 12760 పంచాయతీలకు 1,13,534 వార్డులకు ఎన్నికలు జరగనుండగా.. 27 నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 30 నుంచి రెండో విడత.. డిసెంబర్ 3 నుంచి మూడో విడత నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో కోటి 66 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ వెల్లడించారు. ఓటర్ల జాబితాకు సంబంధించి అన్ని వివరాలు ఈసీ వెబ్‌సైట్లో ఉంటాయని రాణి కుముదిని స్పష్టం చేశారు. ఇప్పటికే రిజర్వేషన్లు సైతం ఖరారు అయిన విషయం తెలిసిందే. తాజాగా, షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.