Telangana local body elections| తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ లేఖ
తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

విధాత: తెలంగాణ ప్రభుత్వానికి(Telangana Government) రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ(SEC) రాయడం ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలలో(Telangana local body elections) రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 42శాతం బీసీ రిజర్వేషన్లపై స్టే విధించిన హైకోర్టు తన ఉత్తర్వులో ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం తెలుపనందునా..హైకోర్టు సూచించినట్లుగా రిజర్వేషన్లపై ప్రభుత్వం అభిప్రాయం చెబితే ఎన్నికలు నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ఈసీ తన లేఖలో పేర్కొన్నట్లుగా సమాచారం. స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం రిజర్వేషన్లు 50శాతం దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. పెంచిన 17శాతం రిజర్వేషన్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని పేర్కొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడిస్తే ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లవచ్చని ఈసీ భావిస్తుంది.
అయితే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందా..లేక హైకోర్టు సూచించినట్లుగా రిజర్వేషన్ విధానం అనుసరించి ఎన్నికలు జరుపుతుందా లేక..పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్తుందా అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సి ఉంది. దీనిపై ఈనెల 16న కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది.