Telangana Tops Liquor Spending : సౌత్ లిక్కర్ కింగ్ తెలంగాణ !
దక్షిణాదిలో అత్యధికంగా మద్యం వినియోగిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఏడాదికి సగటున ఇక్కడ ఒక్కొక్కరు 4.44 లీటర్ల ఆల్కహాల్ తాగుతూ, రూ.11,351 ఖర్చు చేస్తున్నారు.
విధాత: దేశంలో తలసరి మద్యం వినియోగం..ఖర్చులలో దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ టాప్ గా ఉందని తాజాగా ఎక్సైజ్ శాఖ గణంకాలు వెల్లడించాయి. తెలంగాణలో ఏడాదికి సగటు తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లుగా ఉందని తేలింది. రాష్ట్రాల వారీగా ఒక ఏడాదిలో అమ్ముడైన మొత్తం మద్యం పరిమాణాన్ని, ఆయా రాష్ట్రాల జనాభాతో భాగించి తలసరి మద్యం వినియోగాన్ని లెక్కించగా.. తెలంగాణ మొదటి స్థానంలో నిలిచినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది.
సగటున తెలంగాణలో ఏడాదికి 4.44 లీటర్ల ఆల్కహాల్ వినియోగిస్తున్నట్లు ఈ గణంకాలు వెల్లడించాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో కర్ణాటక ఉంది. అక్కడ తలసరి వినియోగం 4.25 లీటర్లు. ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు 3.38 లీటర్లు, ఆంధ్రప్రదేశ్ 2.71 లీటర్లు, కేరళ 2.53 లీటర్ల వినియోగంతో కొనసాగుతున్నాయి.
ఇకపోతే మద్యం వినియోగంపైనే కాకుండా మద్యంపై చేస్తున్న ఖర్చులోనూ తెలంగాణ రాష్ట్రమే టాప్ లో ఉందని ఎక్సైజ్ శాఖ లెక్కలు చాటుతున్నాయి. తెలంగాణలో సగటున ఏడాదికి మద్యంపై తలసరి ఖర్చు రూ.11,351 కాగా ఉండటం గమనార్హం. అదే ఏపీలో రూ.6,399 గా ఉంది.
తెలంగాన రాష్ట్ర ప్రభుత్వ ఖజనాకు మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం కీలకంగా కొనసాగుతున్నది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు మద్యం ద్వారా వచ్చే రాబడి ప్రధాన వనరుగా ఉన్నది. అయితే ప్రభుత్వాలు మద్యంను ఆదాయ వనరుగా భావించకుండా సామాజిక దుష్ఫలితాలను పరిగణలోకి తీసుకుని బాధ్యతతా మద్యం అమ్మకాల నియంత్రణ చర్యలు చేపట్టాలని స్వచ్చంద సంఘాలు కోరుతున్నాయి. మద్య పానం అలవాటుతో ఎన్నో కుటుంబాలు ఆరోగ్య పరంగా..ఆర్థికంగా చితికిపోతున్నాయి. అలాగే రోడ్డు ప్రమాదాలు, నేరాలకు మద్య పానం కారణమతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు మద్య నిషేధ చర్యలు కాకపోయినా..కనీసం నియంత్రణ చర్యలైన తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది.
ఇవి కూడా చదవండి :
Anasuya | ముదురుతున్న శివాజీ కామెంట్స్ వివాదం.. నా బాడీ నా ఇష్టం అంటూ అనసూయ ఫైర్
Silver, Gold price increase| ఆగని వెండి..బంగారం పరుగు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram